
కూకట్పల్లి నుంచి మహాకూటమి తరఫున నందమూరి సుహాసిని ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి.. నివాళులు అర్పించారు. సుహాసినితో పాటు బాబాయ్ బాలకృష్ణ, కుటుంబసభ్యులు పెద్దసంఖ్యలో వచ్చారు.
ఆనాడు ఎన్టీఆర్‌ను ముందుండి నడిపించిన ఘనత హరికృష్ణదేనని బాలయ్య అన్నారు. కూకట్‌పల్లిలో సుహాసిని గెలుపే హరికృష్ణకు ఘన నివాళి అని అన్నారాయన.
టీడీపీ అభ్యర్థిని సుహాసినితో పాటు పలువురు నందమూరి కుటుంబసభ్యులు ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చారు. మహానేతకు నివాళి అర్పించారు. ఎన్టీఆర్, హరికృష్ణ, చంద్రబాబు, బాలకృష్ణ, ఎల్.రమణ ఆశీస్సులతో ప్రజల ముందుకు వస్తున్నానని సుహాసిని అన్నారు. తనను ఆదరించాలని ప్రజలను కోరారు.
కూకట్పల్లి టికెట్ ఆశించిన టీడీపీ సీనియర్ పెద్దిరెడ్డి కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చారు. సుహాసిని కృషి చేస్తానని ఆయన స్పష్టంచేశారు.