జగన్‌ పాదయాత్ర నేటికి 3వందల రోజులు

jagan padhayatra updates

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో మైలు రాయిని చేరింది. జగన్‌ పాదయాత్ర ప్రారంభించి నేటికి 3వందల రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లాల్లో 32 వ రోజు పాదయాత్ర కొనసాగుతోంది.

ఇవాళ ఉదయం పార్వతీపురం నియోజకవర్గంలోని కోటవానివలస నుంచి ప్రారంభమైన జగన్‌ పాదయాత్ర…బంటువాణి వలస, అడ్డాపుశీల క్రాస్‌, సీతారంపురం, గురుగుపల్లి క్రాస్‌, రామినాయుడు వలస మీదుగా తోటపల్లి రాజర్వాయర్‌ వరకు కొనసాగింది. ప్రజా సంకల్పయాత్రలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు జగన్‌. పాదయాత్ర మూడు వందల రోజులు పూర్తి చేసుకోవడంతో నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.