పెళ్లయిన ఆరు నెలలకే పాపకు జన్మనిచ్చిన నటి

బాలీవుడ్ సెలబ్రెటీ కపుల్ నేహా ధూపియా,అంగద్ బేడి ఇంట్లో సందడి నెలకొంది. వీరి ఫ్యామీలీలో కొత్త అతిధి వచ్చాడు.నేహా ధూపియా ఆదివారం ఉదయం 11 గంటలకు ఓ పండటి పాపకు జన్మనిచ్చారు. మే నెలలో ఢిల్లీలోని గురుద్వారలో నేహా, అంగద్‌ జంట ఒక్కటైంది. కొన్ని సంవత్సరాలు పాటు సహజీవనం చేసిన వీరు ఈ ఏడాది మే నేలలో వివాహం చేసుకున్నారు. తాము ఓ బిడ్డ‌కు జ‌న్మిన‌వ్వ‌బోతున్నామ‌ని ఆగస్టులో సోష‌ల్ మీడియా ద్వారా నేహ ప్ర‌క‌టించింది.”ఇదో కొత్త ప్రయాణం ..ఇకా మేము ముగ్గురం” అంటూ తాను గర్భంతో ఉన్న ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. గ‌ర్భ‌వ‌తి అయిన మూడు నెల‌ల త‌ర్వాతే అంగ‌ద్‌ను నేహ పెళ్లి చేసుకుంది. ముందుగా ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌క‌పోవడంపై నేహ ఓ టాక్ షోలో వివరణ ఇచ్చారు. ” నేను ప్రెగ్నెంట్ అని ముందే చెప్ప‌డానికి కొద్దిగా సంకోచించాను. ఈ విషయం తెలిస్తే అవ‌కాశాలు రావేమోన‌ని భ‌య‌ప‌డ్డాను. గ‌ర్భం వచ్చిన మొద‌టి నాలుగైదు నెల‌లు శరీరాకృతిలో ఎలాంటి మార్పు ఉండదు. కాలాన్ని వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు అందుకే సినిమా షూటింగుల్లో పాల్గొన్నాను. దేవుడి దయ వలన నాకు ఎలాంటి స‌మ‌స్యా రాలేదంటూ” నేహా చెప్పుకొచ్చింది.