టికెట్‌ దక్కని టీడీపీ అసంతృప్తులకు చంద్రబాబు బుజ్జగింపు

cm chandrababunaidu

టికెట్‌ దక్కని టీడీపీ అసంతృప్తులను పార్టీ అధినేత చంద్రబాబు అమరావతికి పిలిచారు. కొత్తగూడెం టికెట్‌ ఆశించిన కోనేరు చిన్ని, మాజీ ఎమ్మెల్యే అరవింద్‌కుమార్‌గౌడ్‌, టీడీపీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి, ఖైరతాబాద్‌ నుంచి నామినేషన్‌ వేసిన బీఎన్‌రెడ్డిని అమరావతికి పిలిచారు. టికెట్‌ దక్కకపోవడంతో వీరంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే కొంత మంది నేతలు అమరావతికి చేరుకున్నారు. టికెట్‌ కోసం ఎదురు చూసి భంగపడ్డ నేతలను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. కూటమి విజయానికి పని చేయాల్సిందిగా సూచించారు.

అటు.. పొత్తుల వల్లే టికెట్లు ఇవ్వలేకపోయామని చంద్రబాబు చెప్పారని కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డ నేత కోనేరు చిన్ని తెలిపారు. భవిష్యత్‌లో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని… మహాకూటమి విజయమే ధ్యేయంగా పని చేయాలని సూచించినట్లు తెలిపారు.