విశాఖ మెట్రో పాలిటన్ సెషన్స్‌ కోర్టు దగ్గర గొంతు కోసుకున్న దోషి

విశాఖ మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు దగ్గర దోషి అప్పలనాయుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. గంజాయి కేసులో అతన్ని న్యాయస్థానం దోషిగా తేల్చింది.

ఆయనతో పాటు ఆరుగురికి 14 ఏళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీంతో.. అప్పనాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని KGHకు తరలించి చికిత్స అందిస్తున్నారు.