సిల్వర్ స్క్రీన్‌ పై అందాల తారల ముద్దుల తనయలు..

movie-artist-complaint-cheating-case-boyfriend-hyderabad

సినీ ఇండ్రస్ట్రీలో వారసత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు హీరో కొడుకులు హీరోలుగా తెరంగేట్రం చేస్తూ క్రేజ్‌ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి మేము మాత్రం ఏం తక్కువ అంటున్నారు.. హీరోయిన్‌ల కూమార్తెలు. మేము కూడా వారసత్వాన్ని నిలబెడతామంటూ సినీ ఇండస్ట్రీలోకి అడుగులు వేస్తున్నారు. ఇటీవలే అందాలతార శ్రీదేవి గారలా పట్టి జాన్వీ వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ‘దడక్’ అంటూ ఇటు కుర్రకారుకు దడ పుట్టించ్చింది. అటు తన నటనతో తల్లికి తగ్గ తనయగా అందరి ప్రశంసలు అందుకుంది.

తాజాగా మరో బాలీవుడ్‌ హీరోయిన్‌ పూజా బేడీ కుమార్తె కూడా సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. అటు బాలీవుడ్ లో ‘జో జీతా వహీ సికందర్, లూటేరా’ వంటి పలు చిత్రాల్లో నటించింది పూజా బేడి. ఇటు టాలీవుడ్‌లో ‘చిట్టెమ్మ మొగుడు, శక్తి’ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పుడు పూజా బేడీ ముద్దుల తనయ ఆలియా ఫర్నీచర్‌వాలా ‘జవానీ జానేమన్‌’ సినిమా ద్వారా పరిచయం కానుంది. ఈ మూవీని దర్శకుడు నితిన్‌ కక్కర్‌ తెరకెక్కించనున్నారు.ఇక సైఫ్‌ కుమార్తె సారా అలీఖాన్‌ కూడా వెండితెరపై కనిపించటానికి తహతహలాడుతోంది. ఇటు టాలీవుడ్‌ నుంచి అటు బాలీవుడ్ వరకు ఈ వారసత్వ ఎంట్రీతో సిల్వర్ స్ర్కీన్ దగదగలాడుతుంది.