ప్లీజ్.. తప్పుకోరూ.. మా ఆవిడ వస్తోంది..

అసలే సెలబ్రెటీలు. ఆపై విదేశంలో వివాహం చేసుకుని స్వదేశానికి వస్తున్నారు. ఇక అభిమానులు వారిద్దరిని సిల్వర్ స్క్రీన్‌పై చూసినా ప్రత్యక్షంగా చూసే అవకాశం వస్తే అస్సలు వదులుకోరు. ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకుని ముంబైకి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు దీపిక, రణ్‌వీర్‌లకు శుభాకాంక్షలు తెలియజేయడానికి భారీ సంఖ్యలో క్యూ కట్టారు.

దీంతో విమానాశ్రయంలో తోపులాట జరిగింది. క్రిక్కిరిసిన అభిమానుల నుంచి భార్య దీపికను కాపాడడానికి రణ్‌వీర్ కొద్దిసేపు బాడీగార్డ్ పాత్ర పోషించాడు. అభిమానులు చుట్టుముట్టినా దీప్‌వీర్‌ల జంట ఏ మాత్రం అసహనానికి గురి కాకుండా వారికి అభివాదం చేస్తూ ముందుకి సాగారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ అయిపోయారు.

విమానాశ్రయం నుంచి నేరుగా రణ్‌వీర్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న అభిమానులకు కూడా ఆప్యాయంగా అభివాదం చేసి ఇంట్లోకి వెళ్లారు. ఈ జంట ఈ నెల 14న కొంకణి సంప్రదాయం ప్రకారం.. 15న సింధి సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో రిసెప్షన్ వేడుకకూడా రెండు నగరాల్లో బెంగళూరు, ముంబై నగరాల్లో జరుపుకోనున్నారు.