చరణ్, తారక్ రెడీ.. యాక్షన్.. #RRR

బాహుబలి సిరీస్ తో నేషనల్ వైడ్ ఫేమ్ సంపాధించారు దర్శకధీరుడు రాజమౌళి.  తన కొత్త సినిమాని నవంబర్ 11న 11 గంటలకు లాంచనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో మల్టిస్టారర్ చిత్రంగా రూపొందబోతున్నఈ మూవీ షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది.

చరణ్‌ రెడీ, తారక్‌ రెడీ అంటూ తను డైరెక్ట్‌ చేస్తున్న ఓ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు రాజమౌళి. దీంతో పాటు తారక్, చరణ్‌లతో కలిసి దిగిన ఫోటోను కూడ ఆయన ట్వీట్‌ చేశారు. దీంతో ఈ ఫోటోతో పాటు తొలి షాట్‌కు దర్శకత్వం వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్‌ మూవీ కోసం అటు నందమూరి ఫ్యాన్స్.. ఇటు మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.