రెండో తరగతి పిల్లాడిని చైర్‌లో కూర్చోబెట్టి.. ట్యూటర్ చేసిన పని..

రెండో తరగతి పిల్లాడిపై తన ప్రతాపం చూపించాడో ట్యూటర్. ఆ పిల్లాడిని చైర్‌లో కూర్చోబెట్టి షూతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. వెంట్రుకలు పట్టుకొని లాగుతూ వీపుపై బాదాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాలుడి ఒంటిపై ఉన్న గాయాలను చూసిన పేరెంట్స్ ఏం జరిగిందని అడగ్గా, అసలు విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు ట్యూషన్ సెంటర్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అందులో పిల్లాడిని ట్యూటర్ కొడుతున్న దృశ్యాలు కనిపించాయి. పేరెంట్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ట్యూటర్ కోసం గాలిస్తున్నారు.