అక్షరహాసన్ అశ్లీల దృశ్యాలను..

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ చిన్న కుమార్తె, నటి అక్షరహాసన్‌ పర్సనల్‌ ఫోటోలు ఇటీవల లీక్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమె లవర్ తనూజ్ ఆ ఫోటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో నటిగా పరిచయం అయిన ఈ అమ్మడు.. అలనాటి హీరోయిన్ రతీఅగ్నిహోత్రి కుమారుడు తనూజ్‌తో ప్రేమాయణం సాగించింది.

దాదాపు ఐదేళ్ల పాటు ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2017లో బ్రేకప్‌ అయింది. అయితే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్న సమయంలో దిగిన ఫోటోలను ఒకరికొకరు షేర్‌ చేసుకున్నారట. ఆ ఫోటోలను ఇప్పుడు తనూజ్ ఇంటర్నెట్‌లో రిలీజ్ చేశారనే వార్తలు సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

దీనిపై తనూజ్‌ తరపు వ్యక్తి స్పందించారు. తనూజ్‌, అక్షరహాసన్‌ లవ్ చేసుకున్న మాట వాస్తవమే. అలాగే వారిద్దరూ డేటింగ్ దృశ్యాలను కూడా సెల్‌ఫోన్‌లో పొందుపరిచిన విషయం నిజమే.. కానీ అక్షర అశ్లీల దృశ్యాలను మాత్రం తనూజ్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదన్నారు. బ్రేకప్ అయినా కూడా వారి మధ్య ఇప్పటీకి స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ అశ్లీల ఫోటోల వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

 

View this post on Instagram

 

@mumbaipolice @cybercrime_cell

A post shared by Akshara Haasan (@aksharaa.haasan) on