మహిళతో వాగ్వాదం.. కాల్పులకు తెగబడ్డ వ్యక్తి

chikago man gun fire

అమెరికాలోని షికాగోలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. మెర్సీ ఆస్పత్రి పార్కింగ్‌ ప్రదేశంలో ఓ మహిళతో వాగ్వాదం అనంతరం అతను విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దుండగుడు కూడా కాల్పుల్లో హతమయ్యాడు.

Also read : మామా.. నన్నాదుకోరూ.. చెప్పుకోలేని బాధలో చైతు

అయితే అతడు తనంతట తాను కాల్చుకున్నాడా లేదా పోలీసుల కాల్పుల్లో చనిపోయాడా అనే విషయం స్పష్టం కాలేదు. ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న ఓ మహిళపై తొలుత దుండగుడు కాల్పులు జరిపాడని, తర్వాత మరో మహిళను కూడా కాల్చాడని పోలీసులు వెల్లడించారు. ఆ యువకున్ని అడ్డుకోబోయిన పోలీసు అధికారి జిమెనెజ్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రి ప్రాంగణంలో జరిగిన కాల్పుల ఘటనతో సిబ్బంది, రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భద్రతా సిబ్బంది ఆస్పత్రిలో ఉన్న వారిని సురక్షితంగా బయటకు పంపించారు.