ఒకరికి ఆస్తమా.. మరొకరికి డయాబెటిస్.. పెళ్లితో..

ఒకరు బాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొంది.. హాలీవుడ్ ఫ్లైట్ ఎక్కింది. అక్కడ క్వాటికో వెబ్ సిరిస్ చేస్తూ బిజీ అయిపోయింది. అక్కడే వరుడ్ని కూడా వెతుక్కుంది. సంగీత దర్శకుడు నిక్ జోనస్‌తో గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతోంది.

ఇక ప్రేమకి ఫుల్‌స్టాప్ పెట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ముహూర్తం కూడా నిర్ణయించేశారు. డిసెంబర్‌లో నిక్ జోనస్‌, ప్రియాంక చోప్రాల వివాహం జరగనుంది. ఈ క్రమంలో తనకి ఆస్తమా ఉందంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. దానికోసం ఇన్‌హెలర్లు కూడా వాడుతున్నానని చెప్పింది ఓ సందర్భంలో.

నా ప్రియురాలు చెప్పగా నాకేంటి అని తాను కూడా ముందుకు వచ్చాడు. తనకీ 13 ఏళ్ల క్రితమే టైప్ 1 డయాబెటిస్ వచ్చిందని చెప్పాడు. బ్లడ్‌లోని షుగర్ లెవల్లో తేడాల కారణంగా సుమారు వంద పౌండ్ల బరువు తగ్గానని అంటున్నాడు. అప్పుడు తను ఎలా ఉన్నానో అంటూ.. ఆ ఫోటోలను కూడా షేర్ చేశాడు.

అయినా ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు సర్థి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మందులు రెగ్యులర్‌గా వేసుకుంటూ మధుమేహాన్ని కంట్రోల్‌లో ఉంచుకుంటున్నానని తెలిపాడు. మొత్తానికి పెళ్లంటేనే షేరింగ్.

బాధ్యతలతో పాటు బాధల్ని కూడా షేర్ చేసుకోవాలి. అందుకు ఓ మంచి పార్ట్‌నర్ దొరికితే జీవితం ఆనందమయం అవుతుంది. ప్రియుడు పదేళ్లు చిన్నవాడైనా ప్రియాంక మదిని దోచాడు. భార్యగా తన హృదయంలో స్థానం ఇచ్చాడు. మరి కొద్దిరోజుల్లో వీరి వివాహం రాజస్థాన్‌లో జరగనుంది.