పెళ్లికి వేళాయె.. స్వీట్ మకరూన్స్‌తో క్యూట్ వెడ్డింగ్ కార్డ్..

డేట్ చెప్పలేదు కానీ డేటింగ్ ఎప్పట్నించో చేసేస్తున్నారు. వివాహం రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో జరగనుందని అధికారిక సమాచారం. మరి పెళ్లి డేట్ ఎప్పుడంటే పెదవి దాటనివ్వట్లేదు. చెప్తాం.. చెప్తాం.. ఇప్పుడే కాదు అంటూ అభిమానులను సస్పెన్స్‌లో పెట్టేస్తున్నారు ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌లు.

అయితే నిజం గడప దాటకముందే అబద్దం ఊరంతా చుట్టేస్తుందన్నంత చందంగా పెళ్లి డేట్ ఎప్పుడో తెలియకముందే వెడ్డింగ్ కార్డ్ రివీల్ అని.. సోషల్ మీడియాలో వీరి పెళ్లి కార్డు చక్కర్లు కొడుతోంది. సెలెబ్రిటీల వెడ్డింగ్ ‌కార్డ్‌లో ఏదో ఒక స్పెషల్ తప్పక ఉంటుంది.

అలాగే ప్రియాంక, నిక్‌లు కూడా రొటీన్‌కి భిన్నంగా అంటే వెండి, బంగారం కుంకుమ భరిణలు లేదంటే స్వీట్స్ లాంటివి అందించకుండా ఫ్రెంచ్ మకరూన్స్‌ని కార్డ్‌తో పాటు అందించనున్నారు. ప్రియాంక పెళ్లి షాపింగ్ కోసం తల్లితో కలిసి ప్యారిస్ వెళ్లింది. ఈ లోపు ఇక్కడ కార్డ్ లీకైంది. వెడ్డింగ్ డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.