వర్షం కారణంగా 17 ఓవర్లకు మ్యాచ్ కుదింపు.. ప్రస్తుతం..

ind vs aus live score

బ్రిస్బేన్ లో ఇండియా-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి టీ20ని వర్షం కారణంగా మ్యాచ్ ను 17 ఓవర్లకు కుదించారు యంపైర్లు. ముందుగా బ్యాటింగుకు దిగిన ఆసీస్ 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో షార్ట్ 7, ఫించ్ 27, లిన్ 37, మ్యాక్స్ వెల్ 46 పరుగులు చేశారు. స్టోయినిస్ 33, మెక్ డర్మాట్ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, బుమ్రా, కేకే అహ్మద్ లు చెరో వికెట్ల తీశారు. కాగా డక్ వర్త్ లూయీస్ నిబంధలన ప్రకారం టీమిండియా టార్గెట్ ను 174 పరుగులుగా యంపైర్లు నిర్ణయించారు. అనంతరం చేజింగుకు దిగిన టీమిండియా 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (7) బెహ్రెన్ డార్ఫ్ బౌలింగ్ లో ఫించ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అనంతరం 81 పరుగుల వద్ద కెఎల్ రాహుల్(13) అవుట్ అయ్యాడు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.