త్వరలో ఇంటింటికీ జియో గిగా ఫైబర్.. ప్లాన్స్ ఇవే

JIO Jio GigaFiber

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకవచ్చిన జియో తన సేవలను ఒక్కొక్కటిగా విస్తరిస్తోంది. జియో సర్విసులను మరింత విస్తృ‌తంగా వినియోగదారులకు అందించడం కోసం గిగా ఫైబర్ వెంచర్‌ను ప్రారంభిస్తున్నట్లుగా ఈ ఏడాది ఆగస్టు 15 న ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫైబర్ టు హోమ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. తమ ప్రాంతంలో ఈ సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని వినియోగదారులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా జియో..గిగా ఫైబర్ సేవలకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తుంది. సమీప భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా 1,100 పట్లణాలలో ఈ సేవలు అందించడం కోసం విస్తృతంగా ఏర్పాట్లను చేస్తుంది. కొద్ది నెలల్లో ఈ సేవలను జియో ప్రారంభించనున్నది. గిగా ఫైబర్ సంబంధించిన ప్లాన్స్‌పై ఎలాంటి స్పష్టత లేనప్పటికీ, ప్రాథమికంగా అందుకున్న సమాచారం ప్రకారం ఈ క్రింది విధంగా ఉండే అవకాశం ఉంది.

Jio GigaFiber ప్లాన్స్ , అంచనా ధరలు

  • రూ. 500 ప్లాన్: నెలరోజుల వ్యాలిడిటీతో 300 GB డేటాతో పాటు 50 Mbps హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది
  • రూ. 750 ప్లాన్: 450GB వేగవంతమైన డేటాతో పాటు 50Mbps డౌన్లోడ్ స్పీడ్‌తో ఇంటర్నెట్ అందిస్తుంది
  • రూ.999 ప్లాన్: 600GB హై-స్పీడ్ డేటాతో పాటు 50Mbps డౌన్లోడ్ వేగంతో ఇంటర్నెట్ అందిస్తుంది
  • రూ.1,299 ప్లాన్: 750GB వేగవంతమైన డేటాతో పాటు 100Mbps డౌన్లోడ్ స్పీడ్‌తో ఇంటర్నెట్ అందిస్తుంది
  • రూ.1,500 ప్లాన్: 900GB వేగవంతమైన డేటా 100Mbps డౌన్లోడ్ స్పీడ్‌తో ఇంటర్నెట్ అందించబోతోంది.

మొదటి దశలో 29 భారతీయ నగరాల్లో ఈ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. దేశవ్యాప్తంగా 1100 నగరాల్లో వివిధ దశల్లో Jio GigaFiber సేవలు సమీప భవిష్యత్‌లో
అందించనుంది.

ప్రయోగాత్మకంగా Jio GigaFiber ప్రారంభం కాబోతున్న నగరాలు ఇవే. బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, కాన్ఫూర్, రాంచీ, పాట్నా, అలహాబాద్, రాయపూర్, నాగపూర్, ఘజియాబాద్, పూణే, థానే, భోపాల్, లక్నో, లూథియానా, మధురై, నాసిక్, ఆగ్రా, మీరట్, రాజ్‌కోట్, శ్రీనగర్, అమృత్‌సర్, ఫరీదాబాద్, గౌహతి, చండీగర్, జోధ్‌పూర్, కోట, సోలాపూర్ పట్లణాలలోని ప్రజలు Jio GigaFiber కనెక్షన్లను పొందనున్నారు.