రామ్, పూరీ కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్..?

poori-jagannadh-and-ram

ఎనర్జిటిక్ రామ్, క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్నట్టు ఫిలిం నగర్లో వార్త హల్చల్ చేస్తోంది.ఇప్పటికే రామ్ కోసం కథను సిద్ధం చేశాడట పూరీ. ప్రస్తుతం కొడుకు ఆకాష్ పూరీ హీరోగా ఓ చిత్రం తయారవుతోంది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

Also read : త్వరలో ఇంటింటికీ జియో గిగా ఫైబర్.. ప్లాన్స్ ఇవే

ఈ చిత్రానికి సంబంధించిన పనులను పూరీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఆకాష్ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే రామ్ తో సినిమా మొదలు పెడతాడట పూరీ.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను వైష్ణో అకాడమీ, స్రవంతి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఇటీవల ‘హలొ గురు ప్రేమకోసమే’ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు రామ్.