ఆత్మలతో మహిళ రొమాన్స్.. ఎందుకో తెలిస్తే..

హవ్వా.. ఇదెక్కడి చోద్యం.. ఆత్మలతో రొమాన్స్ ఏంటీ అనుకుంటున్నారా! మీకు చదవటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజ్జంగా నిజం.. కాకపోతే ఇది జరిగింది మన దేశంలో కాదులెండి.. ఇంగ్లాడ్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ అంశమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : పడక గది దాటుతున్న భార్యాభర్తల రహస్య దృశ్యం

బ్రిస్టల్‌కు చెందిన అమేథిస్ట్ రీల్మ్ అనే మహిళ.. తను టీనేజ్‌లో ఉండగా అబ్బాయిలతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందట. దీంతో వారిపై నమ్మకం కోల్పోవడంతో ఇక ఆత్మలతోనే అన్నీ అంటూ తన అనుభావాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది అమేథిస్ట్.

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఆత్మలతో ఆమె డేటింగ్ చేసిందట. పది సంవత్సరాల పాటు 20 ఆత్మలతో గడిపిన తర్వాత తనకు బాగా నచ్చిన 21వ ఆత్మను పెళ్లిచేసుకున్నట్లు ఆమె తెలిపింది. మొదట పరిచయమైన ఆత్మతో మూడు సంవత్సరాల పాటు సహవాసం చేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాత 20 ఆత్మలతో డేటింగ్ చేసినట్టు తెలిపింది.

పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి.. అన్నట్లుగా.. పిల్లల కోసం తనకు అనుకూలమైన ఆత్మని చివరకు పెళ్లాడిందట అమేథిస్ట్ . 9 నెలలు ఆ ఆత్మతో గడిపిన తర్వాత.. ఆతనితో కలిసి ఇంగ్లండ్ లో రోడ్ ట్రిప్ కు వెళ్లానని ఆమె బుగ్గలు ఎర్రబడేలా సిగ్గుపడుతూ వివరించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పిచ్చి పలురకాలు అని.. ట్రోల్ చేస్తున్నారు.