నిరుద్యోగులకు ఆమ్రపాలి ఆఫర్..

నిరుద్యోగులకు, ఔత్సాహికులకు రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారి ఆమ్రపాలి ఓ మంచి అవకాశం ఇస్తున్నారు. డిసెంబరు 7న జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వెబ్‌సైట్ ద్వారా ప్రత్యక్షప్రసారం (వెబ్‌కాస్టింగ్) చేసేందుకు యువతకు పిలుపునిస్తోంది ఎన్నికల కమిషన్. ప్రజాస్వామ్య క్రతువులో భాగస్వాములను చేస్తూ యువతకు కెరీర్ పరంగా ముందుకు వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇందుకుగాను నైపుణ్యం ఉన్న యువత http://bit.ly/TSwebcast2018 లింక్ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. ఎంపికైన వారికి ప్రభుత్వం నుంచి గౌరవ భృతి, ప్రశంసాపత్రం ఇస్తామంటున్నారు. యువత ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని కోరుతున్నారు.