మరో స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ప్ర‌భాస్

prabhas anushaka

విజువల్ వండర్ బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో ప్రభాస్ ఇప్పుడు మరో ఘనత సాధించాడు. ఫేస్ బుక్‌లో ప్ర‌భాస్ ఫాలోవ‌ర్స్ సంఖ్య ప‌ది మిలియ‌న్స్‌కి చేరింది. దక్షిణాదిలో తారల్లో ప‌ది మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సాధించిన తొలి న‌టుడు ప్ర‌భాస్ కావ‌డం విశేషం. అతి త‌క్కువ టైంలో ప్రభాస్ ఈ ఫీట్‌ని సాధించాడు.ట్విట్ట‌ర్‌,  ఇన్‌స్టాగ్రామ్ లాంటి ప‌లు సామాజిక మాధ్య‌మాల‌లో ప్రభాస్‌కు అకౌంట్ లేదు. ప్రస్తుతం ఈ రెబల్ హీరో ఫేస్ బుక్‌ని మాత్ర‌మే వాడుతున్నాడు. ప్రభాస్ స్రస్తుతం రెండు చిత్రాలలో నటిస్తున్నారు. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో సినిమాతో పాటు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్ చేస్తున్నాడు. ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ సాహో త్వరలోనే అభిమానుల ముందుకు రానుంది.