తొలిరోజే రికార్డుల మోత.. సిక్సర్ల వర్షం కురిపించిన..

క్రికెట్ నయా ఫార్మేట్ టీ10 లీగ్ రెండో సీజన్‌ తొలిరోజే ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. షార్జా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్ధనిస్థాన్ ప్లేయర్‌‌ మహ్మద్ షెహజాద్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 12 బంతుల్లోనే 52 పరుగులు చేసి రికార్డ్ నెలకొల్పాడు. దీంతో రాజ్‌పుత్స్ టీమ్ కేవలం 4 ఓవర్లలోనే 95 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది.

సిక్సర్ల వర్షం కురిపించిన షెహజాద్ కేవలం 16 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. అతని మెరుపు ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 8 సిక్సర్లున్నాయి. అట్టహాసంగా ప్రారంభమైన రెండో సీజన్‌లో ఈ సారి ఎనిమిది మంది భారత క్రికెటర్లు ఆడుతున్నారు. మాజీ ఆటగాళ్ళు జహీర్‌ఖాన్, మునాఫ్ పటేల్, ప్రవీణ్‌కుమార్, బద్రీనాథ్ ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారు.

Also Read : 10 నిమిషాల్లో 50 వార్తలు..