ఇంటర్ తర్వాత నాలుగు సంవత్సరాలు..

జూనియర్ కళాశాల స్థాయిలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దీని ప్రకారం ఇకపై బీఈడీ కోర్సు నాలుగేళ్లు.. మొత్తం 8 సెమిస్టర్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి సెమిస్టర్ 125 రోజులు ఉంటుంది.

ఇంటర్ పూర్తి చేసిన వారితో పాటు జనరల్ విద్యార్థులు కనీసం 50% మార్కులు సాధించి ఉంటే వారు కూడా ఈ కోర్సు చేయడానికి అర్హులు. మిగిలిన వారికి సడలింపు ఉంటుంది. కోర్సులో చేరే ముందుగానే అభ్యర్థులు ఏ కోర్సు (బీఏ, బీకాం)లో చేరాలో తెలియజేయాలి. ప్రతి విద్యార్థి అకడమిక్‌లో కనీసం 80% హాజరు కలిగి ఉండాలి.

ఇక క్షేత్రస్థాయి పనిలో, స్కూల్ ఇంటర్న్‌షిప్‌లో 90% హాజరు ఉండాలి. కోర్సును ప్రారంభించిన తరువాత బ్యాక్‌లాగ్స్ ఉన్నా ఆరేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ప్రతి కోర్సులో 50 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుంది.