లా మూవీ రివ్యూ

విడుదల తేదీ : నవంబర్ 23, 2018

నటీనటులు : కమల్ కామరాజ్ , మౌర్యాణి, పూజా రామచంద్రన్ తదితరులు.

దర్శకత్వం : గగన్ గోపాల్ . ముల్క

నిర్మాత : రమేష్ బాబు మున్నా

సంగీతం : సత్య కశ్యప్

సినిమాటోగ్రఫర్ : పి. అమర్ కుమార్

మౌర్యాణి కి తెలుగు లో ప్రత్యేకమైన ఇమేజ్ తో పాటు మంచి ఆర్టిస్ట్ అనే పేరు ఉంది. పూజా రామచంద్రన్ కూడా వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తుంది. కమల్ కామరాజ్ నటుడిగా ఏదైనా కొత్తదనం అందించాలనే ప్రయత్నాలు నిజాయితీగా చేస్తూనే ఉన్నాడు. పోస్టర్ చూడగానే వీరి ప్రయత్నం పై నమ్మకం కలిగింది. మరి ‘లా’ ఈ నమ్మకాన్ని ఎంత వరకూ నిలబెట్టగలిగిందో చూద్దాం..

కథ :

విక్రమ్(కమల్ కామరాజ్) ని అతని చెల్లి ప్రెండ్ రాధా చూడగానే ఇష్టపడుతుంది. విక్రమ్ కూడా రాధాను ఇష్టపడతాడు. పోలీస్ ట్రైయినింగ్ అయిన విక్రమ్ జాయినింగ్ కోసం ఎదురు చూస్తుంటాడు. రాధాను ఒకతను ఫాలో అవుతుంటాడు. అతను రాధా ఉండే అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా చేరతాడు. అతను చేరిన తర్వాత ఆ అపార్ట్ మెంట్ లో ఉండే నలుగురు కుర్రాళ్ళు చనిపోతూ ఉంటారు. వాచ్ మెన్ గా చేరిన అతనుకు రాధకు సంబంధం ఏంటి..? నలుగురు కుర్రాళ్ళ చావుకు రాధకు ఏదైనా లింక్ ఉందా..? అనేది మిగిలిన కథ..?

కథనం:
ఒక సస్పెన్స్ సినిమాకు కావాల్సిన గ్రిప్పిన్ కథనం తో ‘లా ’ మూవీ నడిచింది. పోలీస్ లుక్స్ లో కమల్ కామరాజు బాగా సూట్ అయ్యాడు. మౌర్యాణి అందం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. ఒక ప్లజంట్ లవ్ స్టోరీ గా మొదలైన ‘లా’ లో కమల్, మౌర్యాణి ల మద్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. వీరి ప్రేమమద్యలో సాగే ప్రేమ సన్నివేశాలు బాగున్నాయి. మంచి ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకున్న కమల్ హీరో పాత్రలో అంతే కాన్పిడెంట్ గా చేసాడు. మంచి నటుడికి ఎలాంటి పాత్రనయినా పోషించే సత్తా ఉంటుందని నిరూపించాడు. మౌర్యాణి ఈ సినిమాకు ప్రధాన బలంగా మారింది. అల్లరిగా హీరో వెంట పడే అమ్మాయిగానూ , తనలో ఒక రహాస్యం దాచుకొని అనుమానాస్పదంగా తిరిగే యువతి గానూ ఆమె నటన చాలా బాగుంది. మేకింగ్ పరంగా ‘లా’బాగుంది. విజయవాడ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే కొన్ని సీన్లు మాత్రమే చిత్రీకరించకుండా సినిమా అంతా విజయవాడ లోనే కంప్లీట్ చేసాడు దర్శకుడు. దీంతో కథలో నేటివిటి సహాజంగా అనిపించింది. అందంగా కనిపించే మౌర్యాణి, హార్రర్ సన్నివేశాల్లో విజృంభించింది. తన నటలో వేరియేషన్స్ చూపించడంలో సక్సస్ అయ్యింది. హార్రర్ విత్ కామెడీ జోలికి వెళ్ళకుండా కథకు కట్టుబడిన దర్శకుడు గగన్ ‘లా’ సెకండాఫ్ ని గ్రిప్పింగ్ మలిచాడు. మౌర్యాణి తో పాటు ‘ప్రమీల’ పాత్రను పోషించిన ‘పూజారామచంద్రన్’ కూడా తన నటనతో ఆకట్టుకుంది. తన తండ్రి హాత్యచేసే సన్నివేశాల్లో ఆమె నటన బాగుంది. ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు ప్రతి రోజూ న్యూస్ లో కనిపిస్తుంటాయి. చట్టాలకు దొరకుండా తిరుగుతున్న అలాంటి వారిని శిక్షించేందుకు పగబట్టిన ఒక యువతి కథను కథాంశంగా ఎంచుకున్న దర్శకుడు వాటిని బలంగా తెరమీదకు తెచ్చాడు. మంచి నటీ, నటలు దర్శకుడు కాన్సెప్ట్ కి ప్రాణం పోసారు. కొన్ని సన్నివేశాలలో ఎమోషన్స్ ని మాత్రమే నమ్మకున్న దర్శకుడు లాజిక్స్ ని పట్టించుకోలేదు. సంగీత దర్శకుడు సత్య కశ్యప్ అందించిన పాటలు బాగున్నాయి. ఈ సినిమాకి పాటలే హైలెట్ గా నిలుస్తాయి.

చివరిగా:

ఆలోచింపజేసే ‘లా’