పాన్‌కార్డ్ కొత్త రూల్.. ఇకపై..

ఇంతకు ముందు వార్షిక ఆదాయం రూ.5 లక్షల టర్నోవర్ దాటిన ప్రతి వ్యాపార సంస్థకు పాన్ కార్డ్ తప్పని సరి అనే నిబంధన ఉండేది. తాజా సవరణల ప్రకారం ఆదాయ పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చిన సవరణ ప్రకారం ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు తగ్గించారు.

అంటే ఏటా రూ.2.5 లక్షల టర్నోవర్ దాటే ప్రతి వ్యాపారికీ ఇకపై పాన్ ‌కార్డ్‌ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధన డిసెంబరు 5 నుంచి అమల్లోకి రానుంది. ఇది వ్యాపారస్తులకు మాత్రమే వర్తిస్తుందని తెలియజేసింది. ఇంతకు ముందు చిరు వ్యాపారులకు పాన్ కార్డ్ తప్పనిసరి కాదు.

కొత్త నిబంధన కిందకి వచ్చే వ్యాపారులంతా 2019 మే 31 కల్లా పాన్ కార్డులను పొందాలని ఆదాయపన్ను శాఖ తెలియజేసింది. ఈ నిబంధనల ప్రకారం బోగస్ కంపెనీల బాగోతం బయటపెట్టే వీలుంటుందని ఐటీ శాఖ భావిస్తోంది. తాజా నిబంధనల ప్రకారం పాన్ కార్డు పై తండ్రి పేరు తప్పనిసరి కాదు. తల్లి పేరు చెప్పినా ఆమోదించే సదుపాయం కల్పించినట్టు ఐటీ శాఖ తెలియజేసింది.