డిఫరెంట్ షేడ్స్ లో ‘తనీష్’.. ‘రంగు’ మూవీ రివ్యూ

కుమార్ శ్రీరామనేని

నటీనటులు : తనీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ష‌ఫీ, టార్జాన్‌, ర‌ఘు కారుమంచి, హ‌రిబాబు, త‌దిత‌రులు
దర్శకత్వం : కార్తికేయ‌.వి
నిర్మాత : ఎ.ప‌ద్మ‌నాభ రెడ్డి, న‌ల్ల అయ‌న్న నాయుడు
సంగీతం : యోగీశ్వ‌ర శ‌ర్మ‌
సినిమాటోగ్రాఫర్ : పిటి.సురేంద‌ర్ రెడ్డి
బ్యానర్: యు అండ్ ఐ ఎంటర్ టైన్మెంట్స్
తనీష్, ప్రియాసింగ్ జంటగా నటించిన మూవీ ‘రంగు’. నూతన దర్శకుడు కార్తికేయ తీసుకున్న విజయవాడ రౌడీ షీటర్ ‘లారా’కథ రిలీజ్ కి ముందే వివాదాలతో ప్రేక్షకుల దృష్టిలో పడింది. బాలనటుడిగా, హీరోగా మెప్పించిన తనీష్ రంగు లో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించిన రంగు ఎలా ఉందో తెలుసుకుందాం…

కథ:
లారా(తనీష్) విజయవాడలో ఉండే కుర్రాడు. ఇంటర్ స్టేట్ ర్యాంకర్ అయిన లారా కాలేజీ ప్రెండ్ కోసం జరిగిన గొడవలో ఒక అతన్ని యాక్సిడెంటల్ గా చంపుతాడు. అప్పటి వరకూ ఆటలు పాటలతో సాగిన లారా జీవితం ఒక్కసారి గా తిరగబడుతుంది. ఆ కేస్ నుండి బయట పడిన లారా ను పోలీస్ లు తమ ప్రయోజనాల కోసం వాడుకోవడం మొదలు పెడతారు. పోలీస్ లకు హెల్ప్ చేసే లారాను ఒకసారే పోలీస్ లే రౌడీ షీటర్ ని చేస్తారు. అప్పటి నుండి పోలీస్ లు అంటే కోపం పెంచుకున్న లారా విజయవాడ కు వచ్చిన రాజేందర్ (పరుచూరి రవి) తో గొడవలు పడతాడు. కొన్ని సెటిల్ మెంట్ లలో న్యాయం కోసం పోరాడిన లారా ను రౌడీ గా మద్ర వేస్తారు. తను ఎంచుకున్న మార్గం లారా కు ఎలాంటి జీవితాన్ని ఇచ్చింది. పోలీస వ్యవస్థ పై అతను పెంచుకున్న ద్వేషం తగ్గిందా లేదా అనేది మిగిలిన కథ..?

కథనం:
నటుడిగా తనీష్ సీరియారిటీ 20 సంవత్సరాలు.. హీరోగా పది సంవత్సరాలు. నచ్చావులే, రైడ్ వంటి సినిమాలతో ఆకట్టుకున్న తనీష్, లెక్కకు సినిమాలు ఉన్నాయి కానీ అతని టాలెంట్ ని షోకేస్ చేసే సినిమాలు లేవు. నక్షత్రం తో నెగిటివ్ రోల్ లో మెప్పించిన తనీష్ కెరియర్ లో రంగు మాత్రం తప్పకుండా రిఫరెన్స్ గా మిగులుతుంది. రంగులో నాలుగు షేడ్స్ లో కనపించే పాత్రలో తనీష్ విజృంభించాడు.

ఆవేశం మాత్రం చూసే జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చాలా రియలిస్టిక్ గా దర్శకుడు కార్తేకేయ తెరకెక్కించాడు. కార్తికేయ రాసుకున్న కథకు పరుచూరి బ్రదర్స్ మాటలు, సిరివెన్నెల కలం బలంగా మారాయి. ఒక మంచి కథను కాపు కాసే పెద్ద చేతులుగా కనిపించాయి. రంగు లో ఒక ఎమోషన్ ఉంది. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది ‘జంతువులకు చట్టాలు అర్దంకావు కాబట్టి వాటిని చట్టాల క్రిందకు తీసుకురాలేదు’ మరి చట్టాలను పట్టించుకోని మనుషులు కూడా జంతువులతో సమానం. పదునైన మాటలే కాదు అర్ధవంత మైన మాటలతో పరుచూరి బ్రదర్స్ ఈ రంగు సినిమా రంగు ను మార్చారు.

ఈ కథను చెప్పేందుకు దర్శకుడు ఎంచుకున్న స్ర్కీన్ ప్లే చాలా బాగుంది. లారా జీవితంలో ఆఖరి ఘట్టంతో మొదలైన కథను ప్లాష్ కట్స్ తో చెప్పాడు దర్శకుడు. ఈ ప్రయత్నం తో సినిమా ఎక్కడా కూడా కథనం బిగి సడలలేదు. తనీష్ తో పాటు పరుచూరి రవి, షఫీ క్యారెక్టర్ చాలా బాగున్నాయి. పోలీస్ వ్యవస్థలోని కొందరి లంచగొండి తనం యువకుల జీవితాలను ఎలా మారుస్తుంది.. అనే పాయింట్ లారా ను రౌడీ షీటర్ ని చేసింది. తనకు తోచిన న్యాయం చేసినందుకు రౌడీగా ముద్రను వేసింది. లారాను మార్చేందుకు ప్రయత్నించే పోలీస్ అధికారి పాత్రలో పరుచూరి రవి నటన బాగుంది.

ఈ ఒక సందర్భంలో పోలీస్ అధికారి లారాను అడుగుతాడు‘ అందరినీ నువ్వు సెటిల్ చేస్తున్నాం.. మరి నీ కేస్ ఎవరు సెటిల్ చేస్తారు’ అని అప్పడు సమాధానం చెప్పలేకపోతాడు. అదే లారా చివరిలో మిమ్మల్ని సాయం చేయమని అడిగే అర్హత నాకు లేదు కానీ నాకు మీరు తప్ప దిక్కులేదు నన్ను కాపాడండి అని కన్నీళ్ళతో వేడుకుంటాడు. ఈ రెండు సీన్స్ మద్య లారా చేసిన ఎమోషనల్ జర్నీ చాలా గ్రిప్పింగ్ గా రియలిస్టిగ్ ఉంటుంది. నేరస్థులును మార్చేందుకు ప్రయత్నించే పోలీస్ అధికారులు వ్యవస్థలో ఉంటారు. వారిని నమ్మకపోతే పోయే చాలా జీవితాలు తల్లక్రిందులు అవుతాయి.

ఇది రంగులో చెప్పని పాఠంగా చెప్పారు పరుచూరి బ్రదర్స్. విజయవాడ నాది అని ఆవేశంలో అనాలోచితంగా అరిచే లారా , ఒక్కరోజు బ్రతకనివ్వండి రేపు చంపేయండి అని వేడుకునే క్లైమాక్స్ వరకూ ఒక రౌడీ షీటర్ జీవితం ఇంతకంటే గొప్పగా తెరమీద కనపడదేమో అనేంతగా దర్శకుడు ఈ కథను నడిపాడు. కత్తి పట్టుకోవడం హీరోయిజంగా చూపించే స్థాయి నుండి ఒక రౌడీ చావును కూడా హీరోయింజంగా చూపించే ఆలోచనలను దాటి లారా ను ఒక మాములు మనిషిగా చూపించే ప్రయత్నంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్ లో మాణిక్యం క్యారెక్టర్ లో షఫీ నటన ఆకట్టుకుంది.

తెలుగు సినిమాలకు కాస్త దూరం అయిన షఫీ కి మాణిక్యం క్యారెక్టర్ మరింత దగ్గర చేసింది. ఈ కథలో మేకింగ్ పరంగా లోపాలు కనిపిస్తాయి కానీ కథ,కథనాలు పరంగా కనిపించవు. యేగేశ్వర శర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రంగు ను మరింత హృద్యంగా మారింది. ‘సిరివెన్నెల’ కలం మరోసారి ‘ ఎక్కడ ఉందీ చిక్కుముడి’ పాటతో జూలు విదిలించింది. తనీష్ నటన క్లైమాక్స్ లో పతాక స్థాయిలో చేరింది. షఫీ, తనీష్, పరుచూరి రవి పాత్రలు క్లైమాక్స్ లో మరింత స్ట్రాంగ్ గా మారాయి. కత్తి పట్టడం హీరోయిజం కాదు, కత్తి పట్టాలంటే భయపడేంత ఇంపాక్ట్ కలిగించాడు దర్శకుడు.

మొదటి సినిమా అయినా ఒక బరువైన సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయడంలో అతని ప్రతిభ కనిపించింది. ఈ ప్రయత్నానికి వెన్నుదన్నులుగా నిలబడ్డ నిర్మాతలు పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నమ్మకం నిజం అయి ‘రంగు’ ను మంచి చిత్రాల జాబితాలో చేర్చింది. మాస్ ఎలిమెంట్స్ తో పాటు భావోద్వేగాల సంఘర్షణ ఎక్కడా బిగి సడలని కథనం రంగును ఉద్వేగంగా మార్చాయి.

చివరిగా:
రౌడీయిజం ను సవాల్ చేసిన రంగు తనీష్ కెరియర్ లో బెస్ట్ గా నిలుస్తుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.