చైనా సరిహద్దులలో సల్మాన్‌ సైక్లింగ్‌..

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ సరదాగా సైక్లింగ్‌కు వెళ్లారు. ఆయనతోపాటు అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమా ఖండూ, కేంద్ర సహాయమంత్రి కిరణ్‌ రిజీజు కూడా సైకిల్‌ తొక్కారు. చైనా సరిహద్దు ప్రాంతంలో వీరంతా సైక్లింగ్ రేస్‌‌లో పాల్గొన్నారు.

Also Read : కామంతో కళ్లు మూసుకు పోయి.. మతిస్థిమితం లేని అమ్మాయిని..

అరుణాచల్‌ ప్రదేశ్‌లో దాల్మియా ఎంటీబీ అరుణాచల్‌ హార్న్‌బిల్స్‌ సైక్లింగ్‌ రేస్‌ ఇవాళ ముగిసింది. ఈ సందర్భంగా సల్మాన్‌, ఖండూ, రిజీజు సైక్లింగ్‌ రేస్‌లో సరదాగా పాల్గొన్నారు. సైక్లింగ్‌ రేస్‌లో గెలిచినవారికి సల్మాన్‌ చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. ‌త్వరలో మెచుకా అడ్వెంచర్‌ ఫెస్టివల్‌ జరగనుంది. ఈ కార్యక్రమానికి సల్మాన్‌ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.