పట్టపగలే ఫైనాన్సర్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు

పట్టపగలు ఫైనాన్సర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన విజయవాడలో కలకలం రేపింది. ఓ భవన వివాదంలో గదారిన్‌ అనే ఫైనాన్సర్‌పై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మంటలంటుకొని బాధితుడు పరుగులు తీయడంలో గవర్నర్‌పేట బిగ్‌బజార్‌ సమీపంలో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. గదారిన్‌ పరిస్థితి విషమంగా ఉందన్నారు వైద్యులు.