టీ20 ప్రపంచకప్‌.. సెమీఫైనల్స్‌లో చేతులెత్తేసిన భారత్..

టీ20 ప్రపంచకప్‌ కీలక మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌ ఉమెన్‌‌లు చేతులెత్తేశారు. ఓపెనర్‌ స్మృతి మంధాన, రోడ్రిగ్స్‌ మినహా మిగతా బ్యాటర్లంతా తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో భారత్‌ 19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది.

లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు సాధించింది. దీంతో 8 వికెట్ల తేడాతో విజయాన్ని తన సొంతం చేసుకుంది.

మరో వైపు మహిళల టీ20 ప్రపంచకప్‌లో మూడుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. డిఫెండింగ్‌ ఛాంప్ వెస్టిండీస్‌తో జరిగిన మొదటి సెమీస్‌లో ఆసీస్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది.