నిన్న మేకపై.. నేడు శునకంపై లైంగిక దాడి..

కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు రెచ్చిపోతున్నారు. లైంగిక వాంఛలు తీర్చుకోవడం కోసం రాక్షస ప్రవృత్తిని బయటపెడుతున్నారు. వీళ్ల పైశాచికానికి పాపం మూగజీవాలు సైతం మృత్యువాతపడుతున్నాయి. మేవాట్‌లో మేకపై జరిగిన అఘాయిత్యం మరువక ముందే ముంబైలో శునకంపై లైంగిక దాడి జరిగింది.

ఇటీవల హర్యానాలోని మేవాట్‌లో గర్భంతో ఉన్న ఓ మేకపై 8 మంది అత్యాచారానికి ఒడిగట్టారు. వీరి లైంగిక దాడితో ఆ మేక మృత్యువాత పడింది. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టిస్తే.. ఇప్పుడు  అదే తరహాలో మరో కేసు వెలుగు చూసింది. ముంబైలోని శునకం పై జరిగిన అఘాయిత్యం కలకలం రేపింది.

పశ్చిమ మాల్ద్‌లోని మాల్వానీ ప్రాంతంలో ఓ నలుగురు కామవాంఛతో రెచ్చిపోయారు. నవంబర్ 21వ తేదీన ఈ నీచులు శునకంపై అకృత్యానికి ఒడిగట్టారు. మద్యం మత్తులో శునకాన్ని అత్యంత దారుణంగా హింసించి.. పైశాచికానందం పొందారు. నోరు కట్టేసి లైంగికంగా చిత్రహింసలకు గురిచేశారు. దీంతో శునకం ప్రైవేట్ భాగాలు చిధ్రమై తీవ్ర గాయాలయ్యాయి.

ఆ శునకానికి ప్రతిరోజు ఫెర్నాండస్ అనే మహిళ ఆహారం పెట్టేవారు. ఈ సంఘటన జరిగిన రోజు శునకం ఆహారం కోసం రాకపోవడంతో ఆమె వెతకసాగారు. ఇంతలో రోడ్డు మీద రక్తస్రావంతో నేలపై పడివున్న శునకాన్ని చూసి ఆమె షాక్ అయ్యారు.  వెంటనే శునకాన్ని తీసుకువెళ్లి వెటర్నరీ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. మూడు రోజులు మృత్యువుతో పోరాడిన మగ శునకం.. లోపలి అవయవాల్లో ఇన్‌ఫెక్షన్ సోకడంతో శుక్రవారం కన్నుమూసినట్టు వైద్యులు దృవీకరించారు.

శునకంపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేస్తుండగా ఓ రిక్షా అతను గమనించి.. తనకు చెప్పినట్టు ఫెర్నాండస్‌ పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.