పేరు మార్చుకున్న టీ20..

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వరల్డ్ టీ 20 కప్ పేరును మారుస్తున్నట్లు ప్రకటించింది. వరల్డ్ టీ 20 కప్‌ను టీ 20 వరల్డ్ కప్‌గా పేరు మారుస్తున్నట్లు ఐసీసీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది. 2020లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ చాంపియన్ షిప్ నుండి ఈ మార్పు అమలులోకి వస్తుందని ఐసీసీ తెలిపింది.

వన్డే, టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్‌లతో సమానంగా పేరు రావాలనే ఉద్దేశంతో ఇలా చేశామని అధికారులు తెలియజేశారు. ఐసీసీ సభ్యదేశాల మధ్య జరిగే అన్ని టీ 20 మ్యాచ్‌లకు అంతర్జాతీయ హోదా ఇచ్చేందుకు గతంలోనే అనుమతి ఇచ్చినట్లు సీఈఓ డేవిడ్ రిచర్డ్‌సన్ తెలిపారు.