ఆహారం.. ఆరోగ్యం.. కళ్లకు క్యారెట్.. బ్రెయిన్‌కి వాల్నట్.. మరి కొన్ని..

మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారపు అలవాట్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఆరోగ్య జీవనశైలికి కూరగాయలు ఎంతో ఉపయోగపడతాయి. మనం తీసుకునే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని వైద్యులు వివరిస్తుంటారు. మానవ శరీరంలోని కొన్ని ముఖ్యమైన భాగాలకు ఏ కూరగాయ ఎంత ప్రాముఖ్యత వహిస్తుందనే దానిపై అనేక పరిశోధనలు జరిగాయి. ఆయా భాగాలకు పోషకాలు అందించే శరీర భాగాలను ప్రతిబింబించే ఆహార పదార్థాలు కొన్ని వాటిలో…

క్యారెట్ కళ్లకు ఎంతగానో మేలు చేస్తుంది. రోజూ ఆహారంలో క్యారెట్‌ని భాగం చేసుకుంటే కంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. క్యారెట్‌ని కోసి చూస్తే.. కంటి లోపలి భాగాన్ని పోలి ఉంటుంది. ఇదే కంటికి, క్యారెట్‌కు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ విటమిన్ అధికంగా ఉంటుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు ఇది చాలా అవసరం.

ఇక వాల్నట్ మెదడుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని లోపలి భాగంలోని ముడతలు మెదడుని పోలి ఉంటుంది. దీని ఆకారం కూడా మనిషి మెదడును పోలి ఉంటుంది. వాల్నట్‌కు బ్రెయిన్ ఫుడ్ అనే నిక్ నేమ్ కూడా ఉంది. మెదడు పనితీరును మెరుగు పరిచే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఇందులో ఉంటాయి.

కొత్తిమీర శరీరంలోని ఎముకలకు ఉపయోగపడుతుంది. ఈ కాడలు(సెలేరీ) సిలికాన్ మూలం. ఇది ఎముకలకు శక్తిని ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. ఎముకలు 23 శాతం సోడియంని కలిగి ఉంటాయి. సెలెరీ కూడా అదేస్థాయిలో సోడియంని కలిగి ఉంటుందని వైద్యుల పరిశోధనల్లో తేలింది.

అవకాడో గర్భాశయానికి ఉపయోగపడుతుంది. పునరుత్పాదక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. ఫోలిక్ ఆమ్లాల గనిగా అవకాడోస్‌ని చెబుతారు. సర్వైవల్ డిస్ ప్లేసియా లాంటి అసాధారణ పరిస్థితి నుంచి అవకాడో కాపాడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

క్లామ్స్ (నత్తలు) వృషణాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయని పరిశోధనల్లో తేలింది. ఫోలిక్ ఆమ్లం, జింక్‌ ఈ క్లామ్స్‌లో అధికంగా ఉంటాయి. ఇవి మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయని నెదర్లాండ్స్‌లో నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. వీర్యం నాణ్యతను మెరుగుపరుచుకోవడంలో క్లామ్స్ గణనీయమైన ప్రభావం చూపిస్తుంది.

సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, ద్రాక్షపండ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిలోని లెమొనాయిడ్స్ రొమ్ము కణాల్లోని క్యాన్సర్ అభివృద్ధిని నిరోధిస్తాయి.

ఇక కోస్తే గుండె గదుల ఆకారంలో ఉండే టమోటా గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది. టమోటాల్లోని లైకోపీస్ కారణంగా పురుషులు, మహిళల్లో గుండె జబ్బులు తగ్గుతున్నాయని అధ్యయనాల్లో తేలింది.

రెడ్ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫెనోల్స్ సమృద్ధిగా లభిస్తాయి. గుండె సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ఎల్‌డీఎల్ కొలెస్టరాల్ వంటి వాటికి వ్యతిరేకంగా రెడ్‌వైన్ పని చేస్తుంది. రెడ్ వైన్ రక్తం గడ్డకుండా చూస్తుంది. గుండె జబ్బుల బారిన పడకుండా ఈ రెడ్ వైన్ కాపాడుతుందని పరిశోధనల్లో తేలింది.

అల్లం జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ఇందులోని జిన్గోల్ అనే రసాయనం వలన వాంతులు, విరోచనాలను నిరోధించే శక్తి కలిగి ఉంటుంది.

పేరుకి దుంప అయినా చిలకడ దుంపలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. శరీర భాగంలోని ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేసే ప్యాంక్రియాసిస్‌ గ్రంధిని పోలి ఉండే ఈ దుంప క్యాన్సర్‌ నుంచి రక్షిస్తుంది. ఇందులో బీటా- కెరోటిన్‌లు అధికంగా ఉంటాయి.

 

అయితే ఏదైనా మితంగా తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. మంచిది కదా అని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోజూ తగినంత తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.