‘మహానటి’కి దక్కిన మరో అరుదైన గౌరవం

అలనాటి తార సావిత్రి జీవితంపై తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ‘మహానటి’ కి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది.

49వ ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)లో ‘మహానటి’ మూవీని ప్రదర్శించారు. ఐఎఫ్‌ఎఫ్‌ఐ ఉత్సవాలు గోవాలో ఘనంగా జరిగాయి.

అందులో భాగంగానే ‘మహానటి’ చిత్రాన్ని అక్కడ ప్రదర్శించారు. ‘ఇండియన్‌ పనోరమ’లో సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి ‘మహానటి’ మూవీకి మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కటం విశేషం.