‘2.0’ సినిమా నిలిపివేయాలంటూ టెలికాం ఆపరేటర్ల అభ్యంతరాలు..

mobile-makers-and-tower-companies-petition-censor-board-to-stall-rajini-akshay-mega-starrer-2-0

భారీ బడ్జెట్‌తో , మరింత భారీ సీజీ వర్క్ తో నిర్మించిన రజనీ కాంత్ సినిమా 2.0 ను నిలిపివేయాలంటూ దేశీయ ప్రైవేట్ టెలికాం సంస్థలు సెన్సార్ బోర్డ్‌ను కోరాయి. దిగ్గజ దర్శకుడు శంకర్‌కు ఇది ఊహించని పరిణామమే. ఇప్పటికే చిత్ర నిర్మాణం ఆలస్యం కావడం, సంవత్సరాల తరబడి జాప్యం కావడంతో ఈ సినిమా విడుదలపై పలు ఊహాగానాలు చెలరేగాయి. ఎట్టకేలకు ఈ నవంబర్ 29న విడుదలకు రంగం సిద్ధం చేశారు. దేశ విదేశాల్లో వేల సంఖ్యలో థీయటర్స్ కూడా బుక్ చేశారు. ఇంతలో టెలికాం కంపెనీలు ఈ దావా వేయడం కలకలం రేపుతుంది. టెలికాం ఆపరేటర్ల సంఘం COAI  , 2.0 ట్రైలర్లు , ప్రమోషన్ వీడియోల పట్ల పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ సినిమాలోని కంటెంట్ తమకు పరవు నష్టం కలిగించేదిగా ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ (CBFC)కు ఫిర్యాదు చేసింది.

టెలికాం కంపెనీల ఆరోపణలు ఇవే..
2.0 చిత్రంలో మొబైల్ ఫోన్స్, ఫోన్ టవర్స్ అత్యంత ప్రమాదకరమని చూపించారని, సైన్స్ కు దూరంగా అసత్య ప్రచారం చేశారని, ప్రజలను  పానిక్ చేస్తూ.. ఫోన్ వాడకంలో భయోత్పాతాలు కల్పించే విధంగా చిత్రంలో కంటెంట్ ఉందని వారు సెన్సార్ బోర్డ్ కు చేసిన ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ చిత్రంలోని కంటెంట్ COAI కు, అందులోని మెంబర్లకు పరువు నష్టం కలిగించేదిగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. IPC (ఇండియన్ పీనల్ కోడ్ ) చట్టంలోని పలు సెక్షన్లను ఉదహరిస్తూ.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపడం, ఉన్న సాంకేతికతను తప్పుగా చూపించడం, వంటి కారణాలను , సినిమాటోగ్రాఫ్ చట్టం 1952 ప్రకారం వారు ఉదహరించారు. ఈ సినిమాలో మొబైల్ వాడకం వల్ల అత్యంత హానికారక రేడియేషన్ విడుదల అవుతుందని, సెల్ టవర్ల సిగ్నల్స్ వల్ల పక్షులు తదితర చిన్న చిన్న జంతువులు చనిపోతున్నాయని శంకర్ చెప్పదలుచుకున్నారని , అందుకే ఇలాంటి అసత్య సినిమా విడుదల నిలిపివేయాలని వారు సెన్సార్ బోర్డును కోరారు. ప్రజల్లో విపరీత భయాందోళనలను పెంచే విధంగా ఈ సినిమా ఉందని.. అందుకే తగు చర్యలు తీసుకోవాలని COAI కోరింది. కాగా ఈ టెలికాం ఆపరేటర్ల సంఘంలోభారతీ ఎయిర్ టెల్వోడాఫోన్ ఐడియారిలయన్స్ జియో కూడా ఉండటం విశేషం. ప్రముఖ టెలికాం కంపెనీలుశంకర్ , రజనీ సినిమా మీద ఇలా ఆరోపణలు చేయడం అటు సినీ వర్గాల్లో, ఇటు మార్కెట్ వర్గాల్లో కలకలం రేపుతుంది. మరి ఈ వివాదంపై CBFC ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.