అమలాపాల్ తో ‘పెళ్లి’.. స్పందించిన విశాల్

vishnu-vishal-thrashes-rumors-his-marriage-amala-paul

కొద్దిరోజుల్లో నటి అమలాపాల్ పెళ్లిపీటలు ఎక్కబోతుంది. ఆమె తమిళ హీరో విష్ణు విశాల్ ను పెళ్లిచేసుకోబోతుంది అని సామజిక మాధ్యమాల్లో వార్తలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ఈ వ్యవహారం గురించి కధనాలు సైతం వచ్చాయి. అయితే ఈ కథనాలపై హీరో విష్ణు విశాల్ స్పందించారు. ‘ఆమెతో నాకు పెళ్లా? ఇదొక స్టుపిడ్‌ న్యూస్‌. ఏదైనా కథనం రాసేటప్పుడు బాధ్యతగా రాయాలి. లేనిపోని రూమర్లు సృష్టించి, కుటుంబాలను ఇబ్బందిపెట్టడం మంచికాదు. ఇకపై దీని గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకండి. అంటూ ఘాటుగా విరుచుకుపడ్డాడు. కాగా విష్ణు విశాల్, అమలాపాల్ జంటగా నటించిన ‘రాక్షసన్‌’ సినిమా వచ్చింది. ఈ సినిమా విడుదల అయినప్పటినుంచి వీరిద్దరి మధ్య రూమర్లు హల్చల్ చేస్తున్నాయి.