‘రెడ్‌మి 6ఎ’ సేల్.. జియో వినియోగదారులకు..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షావోమీ రెడ్‌మి 6ఎ ఫోన్ల కొరకు ప్లాష్‌సేల్ నిర్వహించనుంది. అమెజాన్‌తో పాటు ఎంఐ.కామ్ వెబ్‌సైట్లలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్లాష్‌సేల్ ప్రారంభం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఫోన్ కొనుగోలుపై 5 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇక జియో వినియోగదారులకు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2,200 క్యాష్ బ్యాక్‌తో పాటు, 100 జీబీ జియో 4 జీ డేటాను అందిస్తున్నారు.

2జీబీ ర్యామ్.. 16 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.600 పెరిగి రూ.5,999 నుంచి రూ.6,599కి లభ్యమవుతుంది.
3జీబీ ర్యామ్.. 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.500 పెరిగి రూ.6,999 నుంచి రూ.7,4999కి లభ్యం కానుంది.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే..
* డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ+డిస్‌ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో
* ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 10
* ప్రాసెసర్: హీలియో ఏ 22
* ర్యామ్ : 2 జీబీ
* ఇంటర్నల్ స్టోరేజ్: 16 జీబీ
* కెమెరా: 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* బ్యాటరీ: 3000 ఎంఏహెచ్