బీఎన్‌రెడ్డి నగర్‌లో వ్యక్తి దారుణ హత్య

group-people-attacks-man-sickle-hyderabad

మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బీఎన్‌రెడ్డి నగర్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బీడీరెడ్డి గార్డెన్‌ సమీపంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో నరికి చంపారు. ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. కారులో వచ్చిన దుండగులు హత్య అనంతరం కారు అక్కడే వదిలి పారిపోయారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. హత్యకు పాతక్షక్షలు కారణమా? మరేదైన కోణం ఉందా? అన్నదానిపై దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.