ప్రియమైన అతిథులకు.. రిటన్ గిప్ట్ రెడీ..

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌లు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. రాజస్థాన్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికోసం ప్యాలెస్‌ను ఐదు రోజులకు బుక్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

పెళ్లికి కేవలం స్నేహితులు, కుటుంబసభ్యులు మాత్రమే హాజరవనున్నట్లు తెలుస్తోంది. సెలక్టివ్‌గా పిలిచిన అతిధులకు ఓ మంచి బహుమతిని ఇవ్వాలనుకుంటున్నారు దంపతులు ఇరువురూ. అందుకోసం వెండి నాణేలను సిద్దం చేశారు. ఈ నాణేలకు ఒక వైపు ఎన్‌పీ (నిక్, ప్రియాంక) అని రాసి ఉండగా మరో వైపు గణేష్, లక్ష్మీదేవి ప్రతిమలను పొందుపరిచారట.

పెళ్లికి ముందు జరాగాల్సిన పూజా కార్యక్రమాలన్నింటినీ ముగించుకుని జోధ్‌పూర్ వెళ్లనున్నారు కుటుంబసభ్యులు. మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు రేపటి నుండి ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో ఘనంగా జరగనున్నాయి. డిసెంబర్ 2వ తేదీన వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరగనుండగా, డిసెంబర్ 3న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరగనుంది.