ఎస్‌బీఐ ఖాతాదారుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై..

భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. కొన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతన్నట్లు, ఈ నిర్ణయం బుధవారం నుంచి అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ ప్రకటించింది. ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఉన్న డిపాజిట్లపైన, అదే విధంగా రెండేళ్ నుంచి మూడేళ్ల వరకు ఉన్న డిపాజట్లపై ఈ సవరించిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

నవంబరు 28 నుంచి ఈ వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయని తెలియజేస్తోంది. సాధారణ ఖాతాదారులు ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఇప్పటి వడ్డీ రేటు 6.70 శాతం ఉండేది. దీనిని 6.80 శాతానికి పెంచింది. అదే విధంగా వృద్ధులు ఒక ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ రేటును 7.20 శాతం నుంచి 7.30 శాతానికి పెంచింది.

రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే సాధారణ ఖాతాదారులకు వడ్డీ రేటు 6.75 శాతం నుంచి 6.80 శాతానికి పెంచింది. వృద్ధులు రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఇప్పటి వరకు 7.25 శాతం వడ్డీ లభించేది, ఇకపై దీనిని 7.30 శాతానికి పెంచింది.