పిజాలో కెచప్ తక్కువైందని.. రూంలోకి వెళ్లి..

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంటుంది కొందరికి. ఆ సమయంలో ఏం చేస్తున్నారో తెలియనంతగా విచక్షణను కోల్పో్యి ప్రవర్తిస్తుంటారు. యూఎస్ కాలిఫోర్నియాకు చెందిన 24 ఏళ్ల మైరా బెరెనైస్ గల్లో మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్లి పిజా ఆర్డరిచ్చింది. పిజాలో టమోటా కేచప్ తక్కువైందని అమ్మాయి కోపం నషాలానికి అంటింది. అంతే వెంటనే మేనేజర్ ఉన్న రూంకి వెళ్లింది. అతడి కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప పగలగొట్టింది. దీనికి సంబంధించిన ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వీళ్ల మధ్య గొడవను
గమనించిన ఓ వ్యక్తి లోపలికి వెళ్లి ఆ యువతిని బయటికి తీసుకువచ్చాడు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.