2.0 ఫస్ట్ డే కలెక్షన్లు..

2-0-first-day-collections-out-now

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌లు ప్రధాన పాత్రల్లో.. ఎస్‌ శంకర్‌ దర్శకత్వంలో విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన 2.0 అన్ని రికార్డులను తిరగరాస్తూ అత్యధిక థియేటర్లలో విడుదలై కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు వచ్చాయి. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీలో 110 కోట్ల షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా.. కేవలం ఒక్క హిందీలోనే రూ.25 కోట్లకుపైగా వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. బాహుబలి2, కబాలి, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రాలకు వచ్చిన రికార్డులను అధిగమించే దిశగా 2.0 పయనిస్తోంది. ఈ ఆదివారం నాటికీ 300 కోట్లు పైగానే షేర్ వసూలు చేసే అవకాశమున్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రానికి ప్రముఖ సినీ విమర్శకుడు, యూకే సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు.. 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు.

Also read : వాహనదారులకు శుభవార్త ..తగ్గిన పెట్రో ధరలు