నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో 309 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

అభ్యర్థులు డిసెంబరు 3 నుంచి 24లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.250లు, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. అభ్యర్థులు ముందుగా తమ వివరాలను వన్ ‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) చేసుకుని, తద్వారా వచ్చిన యూజర్ ఐడీ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి.

దరఖాస్తుల సంఖ్య 25 వేలకు మించినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్, అంతకంటే తక్కువ వస్తే నేరుగా ఆన్‌లైన్‌లో మెయిన్స్ నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలూ ఆబ్జెక్టివ్ టైపులో ఉంటాయి. ఆఫ్‌లైన్‌లో నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్‌లో 150 ప్రశ్నలు, మెయిన్స్‌లో 450 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది.