షారుఖ్ ఖాన్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

fire-on-sets-of-shah-rukh-khan-starrer-zero

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్ర‌స్తుతం ఆయన నటిస్తున్న జీరో చిత్ర షూటింగ్ లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ చిత్ర షూటింగ్ ముంబైలోని ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతుంది. అయితే ఓ పాట చిత్రీక‌ర‌ణ కోసం భారీ సెట్ వేయగా అందులో షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల‌న అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. అయితే ఆ సమయంలో షారుక్ ఖాన్ అక్కడే ఉన్నాడు. అదృష్టవశాత్తు ఆయనకు ఏమి కాలేదు.

Also read : అభ్యర్థి మృతి.. ఎన్నిక వాయిదా

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన షూటింగ్ స్పాట్ కు చేరుకొని మంటలను అదుపుచేశారు. భారీగా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతం మొత్తం ద‌ట్ట‌మైన పొగ‌తో అలుముకుంది. దాంతో షారుక్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ చిత్రంలో షారూఖ్ సరసన కత్రినా కైఫ్‌, అనుష్క శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. ఇందులో షారూఖ్ మ‌రుగుజ్జు పాత్ర‌లో, దివ్యాంగురాలి పాత్రలో అనుష్క శర్మలు కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు.