పోర్న్‌కు అడిక్ట్ అయిన భర్త.. పోర్న్ యాప్ లో భార్య ఫోటోలు

భార్య ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్ ఫోటో అప్లికేషన్ సైట్‌లో పేట్టాడో శాడిస్ట్ భర్త. దీంతో భార్య ఫిర్యాదు మేరకు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని ఇండియన్ నౌకా దళంలో కమాండర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి భార్య నగ్న ఫోటోలను ఓ ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేశాడని, వీటిని గుర్తించిన అతని భార్య కొందవ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఇన్స్పెక్టర్ మహదేవ్ కుంభార్ తెలిపారు. అతను గత కొంతకాలంగా అశ్లీల సైట్లకు వ్యసనమైనట్లుగా వెల్లడించారు. ఈ సంఘటనలో బాధితురాలు మాజీ ఆర్మీ అధికారిణి కావడం మరో విశేషం.

పోర్నోగ్రఫీకి వ్యసనంగా మారిన తన భర్తను మార్చడానికి ఆమె అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అతనిలో మార్పు లేదు. అతని ప్రవర్తనతో విసుగు చెందిన ఆమె చివరకు పిల్లలతో కలిసి పూణేలోని తన తల్లిదండ్రులకు వద్దకు వెళ్ళిపోయింది. అక్కడ ఫ్యామీలి కోర్టులో విడాకులకు అప్లై చేసింది.

ఢిల్లీ నుంచి పూణేలో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళుతున్న సమయంలో ఆమె తన భర్త మొబైల్‌ను వెంట తీసుకొని వెళ్ళింది. ఆ ఫోన్ తనిఖీ చేయగా ఆమెకు సంబంధించిన అసభ్యకరమైన చిత్రాలను ఓ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినట్లుగా గుర్తించింది. దీంతో ఆమె వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

తన ఫోటోలతో పాటు ఆమె భర్త సహోద్యోగి భార్యకు సంబంధించిన అభ్యంతరకరమైన చిత్రాలను కూడా అందులో పోస్ట్ చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త ఆమెతో అక్రమసంబంధం పెట్టుకున్నట్లు ఆరోపించింది.

ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సంబంధిత చట్టం కింద అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు తదుపరి విచారణ కోసం నేవీ ఉన్నత అధికారుల అనుమతి కోరుతూ లేఖలు వ్రాశారు.