షాకింగ్.. స్పీడుగా దూసుకొస్తున్న ట్రైన్ ముందు సైకిలిస్టు.. క్షణాల్లో..

భూమ్మీద నూకలు ఉంటే చాలు మృత్యువు చివరి అంచుల దాకా వెళ్లినా బతికి బయటపడొచ్చు అంటారు. నెదర్లాండ్స్‌లో జరిగిన ఓ ఘటన ఇందుకు చక్కటి ఉదాహరణ. అర సెకన్ తేడాతో రైలు ప్రమాదం నుండి తప్పించుకున్న సైకిలిస్టు వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది.

నెదర్లాండ్స్ లోని రైల్వే క్రాసింగ్‌ వద్ద ఓ సైకిలిస్టు ట్రాక్ దాటే ప్రయత్నంలో ఒకవైపు ట్రైన్ వస్తోందని ఆగాడు. ట్రైన్ దాటి వెళ్లగానే ట్రాక్ దాటుతున్నాడు. అయితే మరోవైపు నుంచి వేగంగా దూసుకొస్తున్న ట్రైన్‌ను అతను గమనించలేదు. దీంతో సైకిల్ తొక్కుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇంతలో రైలు స్పీడ్‌గా అతని దగ్గరలోకి దూసుకొచ్చింది. అంతే.. ఒక్కసారే అతని ఒళ్లు జలదరించింది. వెంటనే అప్రమత్తమైన ఆ కుర్రాడు అదృష్టవశాత్తు తప్పించుకోగలిగాడు. దీంతో కూత వేటులో మృతువు నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో నెటిజన్లు ఆసక్తిర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.