క్యాప్షన్ పెడితే కారు మీదే.. ఆనంద్ మహీంద్రా బంపరాఫర్

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఏదైనా తనకు నచ్చిన ఫొటో కానీ ఇన్సిడెంట్ కానీ లేదా స్ఫూర్తినిచ్చే వ్యక్తులు, పలు అంశాలకు సంబంధించిన విషయాలను నెటిజన్స్‌తో పంచుకుంటారు. ఇంతకూ ఆయనకు నచ్చిన అంశం..

ఓ వ్యక్తి సైకిల్‌పై వెళుతూ తలపైన ఇటుకలు, కాంక్రీటు తీసుకు వెళ్లే చిన్న సైజు ట్రాలీని పెట్టుకున్నాడు. సైకిల్ వెనుక క్యారేజీకి ట్రే కట్టాడు. ఈ ఫోటో చూస్తే తనకు మంచి క్యాప్షన్ పెట్టాలనిపించిందని, అయితే తనకు ఏం పెట్టాలో ఐడియా రావట్లదేని.. అందుకే ఓ మంచి క్యాప్షన్ పెట్టండి అంటూ పిలుపునిచ్చారు.

ఫ్రీగా ఏం కాదండి.. రెండు మంచి కొత్త మోడల్ కార్లను బహుమతిగా కూడా ఇస్తానంటూ ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా తానే ఏవైతే కార్లు ఇవ్వదల్చుకున్నానో వాటి ఫోటోలను కూడా షేర్ చేశారు. మరి మహీంద్రా కార్ల కోసం నెటిజన్స్ ట్వీట్లతో క్యూ కట్టేస్తున్నారు.