ఈ మ్యాజిక్ షో చూస్తే..

2018 వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఆఫ్‌ మ్యాజిక్‌ ఫైనల్‌ పోటీలు అత్యంత ఆసక్తికరంగా సాగాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మెజీషియన్లు అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. అయితే ఇందులో అసమాన రీతిలో కనికట్టు విద్య ప్రదర్శించిన ఎరిక్ షీన్‌ విజేతగా నిలిచాడు.

ఫైనల్లో అతడు చేసిన మ్యాజిక్‌ షో.. అందరినీ అబ్బుర పరిచింది. తన మ్యాజిక్ షోకి అటు న్యాయనిర్ణేతలు.. ఇటు అభిమానులను ఫిదా అయిపోయారు.

గతంలో కార్డులతో ఎరిక్ చేసిన మ్యాజిక్ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఎరిక్‌ని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.