అమెరికా మాజీ అధ్యక్షుడు కన్నుమూత

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్ డబ్ల్యూ బుష్(94) మృతిచెందారు. ఈ విషయాన్నీ ఆయన అధికారిక ప్రతినిధి జిమ్ మెగ్రాత్ వెల్లడించారు. హెచ్ డబ్ల్యూ బుష్ అమెరికాకు 41వ అధ్యక్షుడిగా పనిచేశారు. గతకొంత కాలంగా ఆయన నిమోనియాతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. గతంలో అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసిన జూనియర్ జార్జ్ బుష్‌.. ఈయన కుమారుడే. జూనియర్ బుష్‌ హయాంలోనే అమెరికా వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రవాదులు దాడులు చేశారు.

Recommended For You

1 Comment

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.