భార్యతో గొడవ..కూతురిపై అత్యాచారం

మనిషి మృగమవుతున్నాడు. కళ్ళు మూసుకుపోయి తాగిన మైకంలో కన్నబిడ్డపైనే అత్యాచారం చేశాడు ఓ తండ్రి.ఈ దారుణ సంఘటన ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ లో అక్టోబర్ 28న చోటుచేసుకుంది. తాగిన మైకంలో ఉన్న భర్త.. భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె తన పెద్ద కుమార్తెని ఏడాది వయస్సు ఉన్న చిన్న కుమార్తెని తీసుకొని బంధువుల ఇంటికి వెళ్లింది. మరో మూడేళ్ల కూతురును మాత్రం ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయింది. మద్యం మత్తులో ఉన్న భర్త తన మూడేళ్ళ కూతురుపై అత్యాచారం చేశాడు. తర్వాత రోజు తల్లి వచ్చి చూడగా చిన్నారి అపస్మారక స్థితిలో పడి ఉంది. బాలిక ఒంటిపై రక్తపు మరకలు ఉండడంతో తల్లి చిక్సిత కోసం ఆస్పత్రికి తీసుకువెళ్ళింది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు పాపపై అత్యాచారం జరిగినట్లు ధృవీకరించారు. భర్తే..కూతురుపై ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని గుర్తించిన ఆమె..పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.