కోహ్లీ రియాక్షన్ చూసి.. నెటిజన్లు..

బ్యాట్‌తో సెంచరీలు కొట్టి రికార్డులు సృష్టించిన విరాట్‌ కోహ్లీ.. బౌలర్‌గా మారాడు. అప్పుడప్పుడు బౌలింగ్‌ చేస్తున్న విరాట్ ఈసారి వికెట్ పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రాక్టీస్‌ టెస్ట్ మ్యాచ్‌లో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సెంచరీ కొట్టి జోరుమీదున్న నీల్సన్‌ను ఔట్‌ చేశాడు. అనంతరం కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు.

ఆస్ట్రేలియా బాట్స్‌మెన్‌లు హారీ నీల్సన్, హార్డి దాదాపు 27 ఓవర్ల పాటు సింగిల్స్‌తో ఇన్నింగ్స్ చేస్తూ.. భారత బౌలర్లను విసిగించారు. ఆసీస్ ఆటగాళ్లను ఔట్ చేయడానికి విరాట్ కోహ్లీ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించాడు. ఫలితం లేకపోవటంతో కోహ్లీ బంతిని అందుకున్నాడు. మొత్తం 7 ఓవర్లు వేసిన కోహ్లీ.. 124వ ఓవర్‌లో నీల్సన్‌ను ఔట్ చేశాడు. దీంతో కోహ్లీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. వికెట్ తీసిన తర్వాత కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు పలు ఆసక్తిర కామెంట్లు చేస్తున్నారు.