ఐదేళ్ల ప్రాయంలోనే ఆరు ప్రపంచ రికార్డులు

ఐదేళ్ల ప్రాయంలోనే ఆరు ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్నాడు ఈ బుడతడు. చెచెన్యా దేశానికి చెందిన రఖీమ్‌ కురయెవ్‌ 2 గంటల 22 నిమిషాల్లో ఏకధాటిగా 3వేల 202 బస్కీలు తీసి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఈ ఫీట్‌ చేసినందుకు చెచెన్యా నేత రమజాన్‌ కాడిరోవ్‌ నుంచి బహుమతిగా ఒక బెంజ్‌ కారును సొంతం చేసుకున్నాడు. బొమ్మల దుకాణంలో ఉచితంగా కొనుగోలు చేసే అవకాశం కూడా పొందాడు.