‘ఎన్టీఆర్’ అడుగుతో ఫ్యాన్స్ ఫిదా.. పాటతో పూనకాలే..

అన్న ఎన్టీఆర్ బయోపిక్‌పై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్ పొలిటికల్ లుక్ ఫోటోను విడుదల చేసింది క్రిష్ టీమ్‌. అన్న ఎన్టీఆర్‌లా.. బాలయ్య బాబు అలా నడిచొస్తుంటే.. తెలుగు వాడి వేడి అందులో క‌నిపిస్తుందంటూ తెగ సంబరపడుతున్నారు నందమూరి అభిమానులు. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే.. తండ్రి పోలిక‌లే కాదు.. హావ‌భావాలు కూడా బాలయ్య దించేసినట్లు అనిపిస్తోంది.

ఇక ఇప్పుడు మొదటి పార్ట్‌ కథనాయకుడికి సంబంధించిన పాటను కూడా రిలీజ్ చేశారు. ఘనకీర్తి సాంద్ర, విజితాఖిలాంద్ర, జనతా సుధీంద్ర, మణిదీపకా అంటూ సాగే ఈ పాట ఆత్యంతం ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో పాత్రలు, ఆ విశేషాల్ని గుర్తు చేస్తూ సాగుతోంది. ఎంఎం కీరవాణి స్వరకల్పనలో చిత్రంలో పాటలు రూపుదిద్దుకుంటున్నాయి.